Gooty: గుత్తిలో సీపీఎం ఆధ్వర్యంలో స్వాతంత్ర వేడుకలు
Gooty: అనంతపురం జిల్లా గుత్తిలో సీపీఎం కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించిన మండల కార్యదర్శి వి. నిర్మల. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు.
Gooty: గుత్తిలో సీపీఎం ఆధ్వర్యంలో స్వాతంత్ర వేడుకలు
గుత్తి: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం గుత్తి పట్టణంలోని సిపిఎం కార్యాలయం నందు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వి. నిర్మల జాతీయ జెండాను ఎగరవేశారు.
ఈ సందర్భంగా వి. నిర్మల మాట్లాడుతూ 80 సంవత్సరాల స్వాతంత్ర్యంలో గత 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో "ఎక్కడ వేసిన గొంగళి అక్కడే" అన్నట్లు ఉందన్నారు. దేశ సంపదను ఆదాని, అంబానీ వంటి కార్పొరేట్ పెట్టుబడిదారులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు.
రైతులు, నిరుద్యోగులు, కార్మికులు, కర్షకులపై నల్ల చట్టాలు తెచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. బిజెపి ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను, కార్మికుల శ్రమను కార్పొరేట్ల చేతిలో పెట్టకుండా సామాన్య ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు చందు, ఉపాధ్యక్షురాలు వన్నూరమ్మ, సిపిఎం పార్టీ సభ్యులు సావిత్రి, మల్లిక, రమాదేవి, రామేశ్వరి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.




