Gooty: తలకిందులుగా నిలబడి నిరసన తెలపిన గుత్తి డాక్యుమెంట్ రైటర్లు

Gooty: జీవో 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుత్తి సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్ వద్ద డాక్యుమెంట్ రైటర్లు తలకిందులుగా నిలబడి వినూత్న రీతిలో నిరసన తెలిపారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 28 July 2026 4:50 PM IST
Gooty
X

Gooty: తలకిందులుగా నిలబడి నిరసన తెలపిన గుత్తి డాక్యుమెంట్ రైటర్లు

గుత్తి: గుత్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో నెం.396*ను తక్షణమే రద్దు చేయాలని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ *అనంతపురం జిల్లా గుత్తి లో డాక్యుమెంట్ రైటర్లు సోమవారం వినూత్న రీతిలో నిరసన చేపట్టారు.

గుత్తి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట డాక్యుమెంట్ రైటర్లు తలకిందులుగా నిలబడి తమ నిరసన తెలియజేశారు. "396 జీవో అమలు చేయొద్దు... మా జీవితాలు తలకిందులు చేయొద్దు" అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 396 అమలులోకి వస్తే వేలాది మంది డాక్యుమెంట్ రైటర్ల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటుతో తమ వృత్తి పూర్తిగా దెబ్బతింటుందని, ఎన్నో సంవత్సరాలుగా ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.

ప్రభుత్వం వెంటనే జీవో 396ను రద్దు చేసి, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL