Gooty: గుత్తి కోట జెడ్పీ స్కూల్ విద్యార్థుల సత్తా.. సప్లిమెంటరీలో మెరిసిన వైనం!

Gooty: అనంతపురం జిల్లా గుత్తి కోట జెడ్పీ హైస్కూల్ విద్యార్థుల సత్తా. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 19 Jun 2026 1:51 PM IST
Gooty
X

Gooty: గుత్తి కోట జెడ్పీ స్కూల్ విద్యార్థుల సత్తా.. సప్లిమెంటరీలో మెరిసిన వైనం!

అనంతపురం జిల్లా: గుత్తి పట్టణంలో శుక్రవారం విడుదలైన పది సప్లిమెంటరీ ఫలితాలలో గుత్తి కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థుల సత్తా చాటారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.ఎం సుభహాన్ గారు మాట్లాడుతూ.. పదోతరగతి సప్లమెంటరీ పరీక్షలలో 2025-2026 బ్యాచ్ కు సంబంధించి 24 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవ్వగా 19 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు మరియు 2024-2025 బ్యాచ్ కు సంబంధించి 7 మంది విద్యార్థులు హాజరు అవ్వగా 7 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడానికి కృషిచేసిన ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story