Gooty: మట్కా రాస్తున్న వ్యక్తి అరెస్ట్.. రూ.22,350 నగదు స్వాధీనం!

Gooty: అనంతపురం జిల్లా గుత్తి టౌన్ చెర్లోపల్లిలో పోలీసులు మెరుపు దాడి చేసి మట్కా రాస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 14 Aug 2026 5:52 PM IST
Gooty
X

Gooty: మట్కా రాస్తున్న వ్యక్తి అరెస్ట్.. రూ.22,350 నగదు స్వాధీనం!

గుత్తి: అనంతపురం జిల్లాగుత్తి CI రామారావు ఆధ్వర్యంలో గుత్తి టౌన్ పోలీసులు మెరుపు దాడి* నిర్వహించి మట్కా రాస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. 14-08-2026 ఉదయం 11:30 గంటల సమయంలో CI రామారావు గారి సూచనల మేరకు SI సురేష్ మరియు పోలీస్ సిబ్బంది గుత్తి టౌన్, చెర్లోపల్లి కాలనీలోని బ్రహ్మయ్య గుడి వద్ద దాడి చేశారు. ఈ దాడిలో షేక్ అన్వర్ భాషా, 54 సం.లు, S/O లేట్ అబూ తాలిం, కులం: ముస్లిం, D.No.10/685, చెర్లోపల్లి కాలనీ, గుత్తి టౌన్ అనే వ్యక్తిని పట్టుకున్నారు.

అతని వద్ద నుండి మొత్తం 22,350/- రూపాయల నగదు, 7 మట్కా చీటీలు మరియు ఒక బాల్ పెన్నును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా CI రామారావు మాట్లాడుతూ గుత్తి టౌన్ నందు మట్కా, గంజాయి, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు సమాచారం ఉన్నట్లయితే వెంటనే గుత్తి పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story