Gooty: గుత్తి ఆర్టీసీ బస్సు ఢీకొని పాఠశాల పీడీ తీవ్ర గాయాలతో మృతి

Gooty: అనంతపురం జిల్లా గుత్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. సేవాగాడ్ పాఠశాల పీడీ మనోజ్ అక్కడికక్కడే మృతి, విద్యార్థికి తీవ్ర గాయాలు. కేసు నమోదు.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 19 Aug 2026 9:13 PM IST
Gooty
X

Gooty: గుత్తి ఆర్టీసీ బస్సు ఢీకొని పాఠశాల పీడీ తీవ్ర గాయాలతో మృతి

గుత్తి: గుత్తి పట్టణ శివార్లలోని చెరువు కట్ట వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సేవాగాడ్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఫిజికల్ డైరెక్టర్ పి.డి మనోజ్ అక్కడికక్కడే మృతి చెందారు.

వివరాల ప్రకారం.. సేవాగాడ్ పాఠశాలలో పనిచేస్తున్న ఫిజికల్ డైరెక్టర్ మనోజ్, అదే పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న రషీద్ అనే విద్యార్థిని బైకుపై ఎక్కించుకుని గుత్తికి బయలుదేరారు. గుత్తి పట్టణ శివారులోని చెరువు కట్ట వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి బైక్ ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో మనోజ్ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. విద్యార్థి రషీద్ కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన విద్యార్థిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గుత్తి పోలీసులు తెలిపారు. మనోజ్ మృతితో పాఠశాలలో, కుటుంబంలో విషాదం నెలకొంది.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story