Gooty: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయం!
Gooty: స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల నిర్ణయంపై కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.
Gooty: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు చారిత్రాత్మక నిర్ణయం!
Gooty: స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల మాజీ జిల్లా అధ్యక్షులు, కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ వెంకట శివుడు యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.
బీసీలకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ నిర్ణయం బీసీల రాజకీయ సాధికారతకు ఎంతో దోహదపడుతుందని ఆయన తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశానికి ఆమోదం లభించడం శుభపరిణామమన్నారు. అనంతరం అసెంబ్లీలో చర్చించి బిల్లు రూపొందించి రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు రావడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.
1984లో ఎన్టీ రామారావు గారు టీడీపీని స్థాపించిన అనంతరం బీసీలకు స్థానిక సంస్థల్లో 20 శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని, అనంతరం 1995లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించారని వెంకట శివుడు యాదవ్ గుర్తు చేశారు.
అయితే 2019లో గొడ్డలి పార్టీ (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ) అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను 24.1 శాతానికి తగ్గించి 16800 మంది బీసీల రాజకీయ అవకాశాలను కాలరాసిందని ఆరోపించారు.
గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం బీసీలకు తిరిగి 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలపడం బీసీలకు ఎంతో ప్రయోజనం చేకూర్చే నిర్ణయమని పేర్కొన్నారు.
ఈ నిర్ణయం ద్వారా బీసీలలో రాజకీయ చైతన్యం మరింత పెరుగుతుందని, ప్రశ్నించే తత్వం బలపడుతుందని అన్నారు. బీసీల రాజకీయ, సామాజిక అభ్యున్నతికి ఈ నిర్ణయం మరింత దోహదపడుతుందని వెంకట శివుడు యాదవ్ తెలిపారు.
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ మరియు కూటమి ప్రభుత్వానికి బీసీల తరపున వెంకట శివుడు యాదవ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.




