Kadiri: జలసాల కోసం దొంగగా మారిన ప్రభుత్వ ఉద్యోగి

Kadiri: శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో షేర్ మార్కెట్ అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచర్‌గా మారిన ట్రాన్స్‌కో సీనియర్ అసిస్టెంట్ రమేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 2 May 2026 3:00 PM IST
Kadiri
X

Kadiri: జలసాల కోసం దొంగగా మారిన ప్రభుత్వ ఉద్యోగి

Kadiri: జలసాలకు అలవాటు పడిన ప్రభుత్వ ఉద్యోగి. చివరకు అప్పుల పాలయ్యారు అప్పులు తీర్చేందుకు అత్యాశకు పోయి షేర్ మార్కెట్లో కోటి 50 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పోగొట్టుకొని చివరికి అప్పులు తీర్చేందుకు చైన్ స్నాచర్ గా మారి మహిళల మెడలో గొలుసులు దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడి చివరికి కటకటాల పాలయ్యారు.

శ్రీ సత్య సాయి జిల్లా కదిరి ట్రాన్స్కో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రమేష్ నాయక్ అప్పులు తీర్చేందుకు దొంగగా మారి ఇటీవల మహిళల మెడలో గొలుసులు దొంగతనాలు చేశాడు. మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన కదిరి పోలీసులు,

ప్రత్యేకంగా నాలుగు బృందాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దొంగ రమేష్ నాయక్ ను అరెస్ట్ చేసి విచారించగా పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టి కోటి 50 లక్షల రూపాయలు పోగొట్టుకొని చివరికి రమేష్ నాయక్ దొంగతనాలకు అలవాటు పడ్డారని కదిరి డిఎస్పి శివ నారాయణస్వామి తెలిపారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story