Guntakal: ఎమ్మెల్యే తనయుడి పర్యటనకు జేసీబీలతో ముళ్ల పొదల తొలగింపు

Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం పామిడి మండలం అనుంపల్లి గ్రామ రహదారిపై ప్రమాదకరంగా మారిన ముళ్ల చెట్లను జేసీబీ సహాయంతో తొలగించారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 15 July 2026 12:04 PM IST
Guntakal
X

Guntakal: ఎమ్మెల్యే తనయుడి పర్యటనకు జేసీబీలతో ముళ్ల పొదల తొలగింపు

Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే *శ్రీ గుమ్మనూరు జయరాం గారి తనయుడు, యువనేత శ్రీ గుమ్మనూరు ఈశ్వర్ గారు ఇటీవల పామిడి మండలం అనుంపల్లి గ్రామంలో పర్యటించారు.

ఈ సందర్భంగా కట్టకిందపల్లి నుండి అనుంపల్లికి వెళ్లే రోడ్డు ఇరువైపులా ముళ్ల చెట్లు రోడ్డుపైకి వచ్చి ప్రమాదకరంగా ఉన్నాయని, వీటి వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు ఈశ్వర్ గారి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన గుమ్మనూరు ఈశ్వర్ గారు వెంటనే ఆ చెట్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు.

ఈ ఆదేశాల మేరకు సోమవారం అనుంపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు ఆవుల శివ, ఫీల్డ్ అసిస్టెంట్ ఆవుల ఓబులేష్ గారి ఆధ్వర్యంలో జేసీబీ సాయంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ముళ్ల చెట్లను తొలగించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారికి, యువనేత గుమ్మనూరు ఈశ్వర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL

Next Story