Guntakal: గుంతకల్లులో రూ. 27 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ!

Guntakal: పట్టణంలోని 3 వార్డులలో రూ. 27 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన కూటమి ఇన్ఛార్జ్ గుమ్మనూరు నారాయణ స్వామి, అధికారులతో కలిసి భూమి పూజ.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 22 July 2026 12:54 PM IST
Guntakal
X

Guntakal: గుంతకల్లులో రూ. 27 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ!

Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో నేడు 27 లక్షల రూపాయల వ్యయంతో నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.

పురపాలక సంఘం 2వ వార్డు అంజలి నగర్, 1వ వార్డు నాయి బ్రాహ్మణ కాలనీ, 19వ వార్డు సత్యనారాయణ పేట ప్రాంతాల్లో ఈ రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు.

ఈ కార్యక్రమానికి పట్టణ కూటమి ఇంచార్జి గుమ్మనూరు నారాయణ స్వామి మున్సిపల్ కమిషనర్ లక్ష్మీ దేవి, డిఈ షబానా ఏఈ హరికృష్ణ సంబంధిత వార్డుల ప్రజాప్రతినిధులు, ఇతర కూటమి సభ్యులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ గుంతకల్లు పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని తెలిపారు. నాణ్యతతో త్వరగా రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL

Next Story