Guntakal: గుంతకల్లులో మున్సిపల్ కమిషనర్ లక్ష్మీ దేవి ఆకస్మిక తనిఖీ
Guntakal: గుంతకల్లు 31, 33 వార్డుల్లో పారిశుద్ధ్య పనులను కమిషనర్ లక్ష్మీదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెత్త సేకరణ, డ్రైనేజీల శుభ్రతపై పలు సూచనలు చేశారు.
Guntakal: గుంతకల్లులో మున్సిపల్ కమిషనర్ లక్ష్మీ దేవి ఆకస్మిక తనిఖీ
గుంతకల్లులో పారిశుద్ధ్య కార్యకలాపాల పరిశీలన
- 31, 33 వార్డుల్లో కమిషనర్ లక్ష్మీ దేవి ఆకస్మిక తనిఖీ
అనంతపురం జిల్లా గుంతకల్లు పురపాలక సంఘం పరిధిలోని 31వ వార్డు మస్తాన్ పేట మరియు 33వ వార్డు బెంచ్ కొట్టాల ఏరియా లలో జరుగుతున్న శానిటేషన్ యాక్టివిటీస్ ను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీ దేవి ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ తో పాటు శానిటరీ ఇన్స్పెక్టర్ రవి మరియు శానిటరీ సిబ్బంది ఉన్నారు. వీధుల్లో చెత్త సేకరణ, డ్రైనేజీల శుభ్రత, మురుగునీటి పారుదల తీరును కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ప్రజల నుండి ఫిర్యాదులు ఏమైనా ఉన్నాయా అని కూడా అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, రోజూ వీధులు ఊడ్చడం, చెత్త సక్రమంగా తరలించడం తప్పనిసరి అని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
అలాగే దోమల నివారణకు ఫాగింగ్, డ్రైనేజీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం క్రమం తప్పకుండా చేయాలని సూచించారు. ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తూ స్వచ్ఛ గుంతకల్లు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని కమిషనర్ లక్ష్మీ దేవి అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక , మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.




