Guntakal: పామిడిలో ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు!
Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం పామిడి పట్టణంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.
Guntakal: పామిడిలో ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు!
Guntakal: అనంతపురంజిల్లా పామిడి పట్టణంలో: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానేత డా. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి 77వ జయంతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా పామిడిలో వైఎస్ఆర్ సిపి అనంతపురం జిల్లా కార్యదర్శి పెమ్మక చెన్నకేశవరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహం నికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజర్ కార్యదర్శి చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ, "రాజన్న పేద ప్రజల కోసం అమలు చేసిన ఆరోగ్యశ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు నేటికీ ప్రజల గుండెల్లో ఉన్నాయి. రాజన్న ఆశయ సాధనే మా లక్ష్యం. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు రాజన్న బాటలోనే సంక్షేమ పాలన అందిస్తున్నారని" అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి రామకృష్ణ నాయక్. అనుబంధ విభాగ నాయకులు చుక్కల సూరి. సాకే ఓబులేష్ . వెంకటరామిరెడ్డి దేవేంద్ర యాదవ్ నక్క ఓబులేసు. నారాయణస్వామి. ఎద్దులపల్లి మధు. కాంత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆదినారాయణ రామాంజనేయులు. సుధాకర్ నాయక్ .స్వామి నాయక్ .మురళి నాయక్. వైఎస్ఆర్ సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజన్న జయంతిని స్మరించుకున్నారు.




