Guntakal: గుంతకల్లు 3.5 మీటర్ల సీసీ కల్వర్ట్ పనులు ప్రారంభం
Guntakal: గుంతకల్లులో అభివృద్ధి పనుల్లో భాగంగా సంతోష్ నగర్ రోడ్డు వద్ద 3.5 మీటర్ల సీసీ కల్వర్ట్ నిర్మాణాన్ని ప్రారంభించిన అధికారులు. ఎమ్మెల్యే జయరాంపై కృతజ్ఞతలు.
Guntakal: గుంతకల్లు 3.5 మీటర్ల సీసీ కల్వర్ట్ పనులు ప్రారంభం
గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి.గుంతకల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం మరియు గుంతకల్లు పట్టణ ఇంచార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణ స్వామి గారి ఆదేశాల మేరకు గుంతకల్ పట్టణం 14 & 03 వార్డు సచివాలయం పరిధిలోని రాజేంద్ర నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్చ్ ఎదురుగా సంతోష్ నగర్ కు వెళ్లే రోడ్డు వద్ద 3.5 మీటర్ల సీసీ కల్వర్ట్ పనులను అధికారులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మరియు గుమ్మనూరు నారాయణ స్వామి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పనులు చేపట్టేందుకు సహకరించిన మునిసిపల్ కమీషనర్ లక్ష్మిదేవి ME ఇంతియాజ్ DE శభానా AE హారకృష్ణ కూడా ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు ఇంచార్జ్ శ్రీమతి N. పద్మావతి గారు, 14వ వార్డు ప్రధాన కార్యదర్శి G. R. చిన్న ఎల్లప్ప, తాటాకుల క్రిష్ణ, వాల్మీకి లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు.




