Anantapur: గుంతకల్లులో రూ.30 లక్షలతో రోడ్ల నిర్మాణం!

Anantapur: అనంతపురం జిల్లా గుంతకల్లులో రూ.30 లక్షల విలువైన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు మండల ఇన్‌చార్జి గుమ్మనూరు నారాయణస్వామి.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 29 July 2026 3:45 PM IST
Anantapur
X

Anantapur: గుంతకల్లులో రూ.30 లక్షలతో రోడ్ల నిర్మాణం!

అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ అభివృద్ధిలో భాగంగా మరో ముందడుగు పడింది.ఈరోజు 11వ వార్డు సచివాలయం సమీపంలో రూ.10 లక్షల విలువైన 15వ ఫైనాన్స్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గుంతకల్లు మండల ఇన్‌చార్జి శ్రీ గుమ్మనూరు నారాయణస్వామి గారు భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుంతకల్లు పట్టణంలో మొత్తం రూ.30 లక్షల విలువైన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు.ఇప్పటివరకు గుంతకల్లు పట్టణంలో సుమారు రూ.200 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.

కేవలం రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలోనే గుంతకల్లు ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం గారి ప్రత్యేక చొరవతో 11వ వార్డు అభివృద్ధికి రూ.70 లక్షలు కేటాయించి పలు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామని తెలిపారు.

ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, గుంతకల్లు అభివృద్ధికి నిరంతరం కృషి కొనసాగుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, 11వ వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL