Guntakal: కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో వైద్య శిబిరం
Guntakal: గుంతకల్లు మండలం కసాపురంలో మెగా ఉచిత వైద్య శిబిరం. సుమారు 700 మంది భక్తులకు, గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించిన కర్నూలు ఓమినీ హాస్పిటల్ వైద్యులు.
Guntakal: కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో వైద్య శిబిరం
గుంతకల్లు: భక్తులకు, గ్రామస్తులకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురం గ్రామంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈరోజు 18.07.2026 శనివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ ఈఓ శ్రీ మేడేపల్లి విజయ రాజు గారి ఆధ్వర్యంలో జరిగింది.
కర్నూలు ఓమినీ హాస్పిటల్ వైద్య బృందం ఈ శిబిరంలో పాల్గొని ఆలయ సిబ్బంది, భక్తులు, గ్రామ ప్రజలకు సుమారు 700 మందికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్, పల్స్ పరీక్షలతో పాటు గుండెకు సంబంధించిన ఈసీజీ, 2D ఈకో పరీక్షలు కూడా చేశారు. అర్హులైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో దేవస్థాన ప్రధాన అర్చకులు శ్రీ కే రాఘవాచార్యులు గారు, కర్నూలు ఓమినీ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డా. ఇందు ప్రకాష్ రెడ్డి గారు, డా. శిశిర (జనరల్ మెడిసిన్), డా. సుదీప, డా. శ్రీజ గారు పాల్గొన్నారు. అలాగే జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎస్. హరి ప్రసాద్ యాదవ్ గారు, సహాయ కార్యనిర్వహణాధికారి, పర్యవేక్షకులు, కార్యాలయ సిబ్బంది ఈ శిబిరంలో పాల్గొన్నారు. భక్తులు, గ్రామస్తులు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని ఆలయ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.




