Guntakal: ప్రజా దర్బార్‌తో ప్రజల వద్దకే ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం!
Guntakal: గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు.
Guntakal: ప్రజా దర్బార్‌తో ప్రజల వద్దకే ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం!
Guntakal: అనంతపురం జిల్లాగుంతకల్లు నియోజకవర్గం గౌరవ శాసన సభ్యులు శ్రీ. గుమ్మనూరు జయరాం గారు ఆయన సోదరుడు గుంతకల్లు మండల ఇంచార్జ్ శ్రీ నారాయణస్వామి గారి తో కలిసి స్థానిక గుంతకల్లు పట్టణం ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం ఆవరణలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజలనుండి అర్జీలను స్వీకరించడం జరిగింది.
ఈసందర్బంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు. ప్రజలు తమకు ఏదైనా సమస్య ఉంటే అర్జీ రూపంలో తనకు తెలియజేస్తే మీ సమస్య పరిస్కారం చేస్తామని ఇక్కడే తీరే సమస్య అయితే వెంటనే సంబంధిత అధికారితో మాట్లాడి పరిష్కారం చేస్తామని తెలిపారు,
దీర్ఘ కాలిక సమస్యలను పార్టీ ఆఫీస్ కి పంపడం జరుగుతుంది అని తెలిపారు. ఈ ప్రజాదర్బార్ కార్యక్రమం ప్రతి వారం నిర్వహిస్తామని కచ్చితంగా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు... ఈ కార్యక్రమం లో గుంతకల్లు పట్టణ మరియు మండల పట్టణ మరియు మండల కూటమి నాయకులు మరియు కార్యకర్తలు మరియు అధికార సిబ్బంది పాల్గొన్నారు.




