Pamidi: ఎమ్మెల్యే జయరాం చొరవపై 9వ వార్డు ప్రజల హర్షం.. ఘన సన్మానం!
Pamidi: అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం పామిడి పట్టణం 9వ వార్డులో గత రెండేళ్లుగా నిలిచిపోయిన మొహరం పండుగను నిర్వహించేందుకు చొరవ చూపిన ఎమ్మెల్యే.
Pamidi: ఎమ్మెల్యే జయరాం చొరవపై 9వ వార్డు ప్రజల హర్షం.. ఘన సన్మానం!
Pamidi: అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం పామిడి పట్టణం 9వ వార్డు కాగితాల మఖానము నందు గత రెండు సంవత్సరాలుగా మొహరం పండుగ నిర్వహించడం లేదు ఈ సందర్భంగా 9వ వార్డు ప్రజలు మరియు కూటమి నాయకులు కలిసి గుంతకల్ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారిని మరియు ఆయన తనయుడు యువనేత గుత్తి మరియు పామిడి టిడిపి ఇన్చార్జ్ శ్రీ గుమ్మనూరు ఈశ్వర్ గారిని మర్యాదపురుగును కలిసి ఈ సంవత్సరం మొహరం పండుగ సజావుగా జరిగేలా చూడాలని విన్నవించారు,
ఈ సందర్భంగా స్పందించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు మరియు గుమ్మనూరు ఈశ్వర్ గారు సదురు అధికారులతో మాట్లాడి ఈసారి మొహరం పండుగ ఘనంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఈరోజు పామిడి పట్టణ 9 వ వార్డు ప్రజలు మరియు ముఖ్య నాయకులు ఆలూరు పట్టణానికి వెళ్లి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారికి,
గుమ్మనూరు ఈశ్వర్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు..మా సమస్య ఇది అని తెలిపిన వెంటనే మాకు దగ్గరుండి మొహరం పండుగ జరిపించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారి మేలు ఎప్పటికీ మర్చిపోమని ఈ సందర్భంగా వార్డు ప్రజలు తెలియజేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో పామిడి పట్టణ నాయకులు పాల్గొన్నారు.




