Guntakal: గుంతకల్లు మున్సిపల్ ఆఫీస్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ!
Guntakal: గుంతకల్లు మున్సిపల్ ఆఫీస్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, నాయకురాలు పత్తి హిమబిందు.
Guntakal: గుంతకల్లు మున్సిపల్ ఆఫీస్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ!
Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం మున్సిపల్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంతకల్లు నియోజకవర్గ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వారితో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి డాక్టర్ శ్రీమతి పత్తి హిమబిందు పాల్గొన్నారు.
ముందుగా మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశ ప్రజలకు మరియు గుంతకల్లు నియోజకవర్గ ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ "స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మనం స్వేచ్ఛగా తిరుగుతున్నాము. ఇలా తిరుగుతున్నామంటే మన మహనీయులు స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేశారు. 1947 ఆగస్టు 15న మన భారతదేశానికి బ్రిటిష్ వారి బానిస సంకెళ్ల నుండి విముక్తి లభించింది. ఈ స్వాతంత్ర్యం మనకు ఊరికే రాలేదు. మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి వేలాది మంది త్యాగధనుల పోరాట ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులందరినీ ఈ రోజు తలుచుకోవడం మన ప్రాథమిక బాధ్యత. కేవలం స్వాతంత్ర్యాన్ని జరుపుకోవడమే కాకుండా మన దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి మన వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రమాణం చేద్దాం" అని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గుంతకల్లు మున్సిపల్ అధికారులు, గుంతకల్లు పట్టణ మరియు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అనుబంధ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




