Kasapuram: కసాపురం ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే గుమ్మనూరు
Kasapuram: కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామిని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
Kasapuram: కసాపురం ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే గుమ్మనూరు
కసాపురం ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
- అనువంశిక ధర్మకర్తలచే ఘన స్వాగతం
అనంతపురం జిల్లా కసాపురం: శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం - కసాపురం లో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం జరిగింది.
గుంతకల్లు ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం మరియు ఆయన సోదరుడు శ్రీ గుమ్మనూరు నారాయణ స్వామి గారు స్వామివారిని దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి అనువంశిక ధర్మకర్తలు శ్రీమతి కె. సుగుణమ్మ గారు, శ్రీ కె. అనంతచార్యులు గారు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం శ్రీ స్వామి వారి శేష వస్త్రం, తీర్థ ప్రసాదాలు ఎమ్మెల్యే గారికి అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు శ్రీ కె. రాఘవాచార్యులు గారు, వేద పండితులు, అర్చకులు, ఆలయ పర్యవేక్షకులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.




