Guntakal: మోదినాబాద్‌లో గుంతకల్లు కమిషనర్ లక్ష్మీ దేవి తనిఖీలు

Guntakal: గుంతకల్లు మున్సిపల్ కమిషనర్ లక్ష్మీ దేవి 37వ వార్డు మోదినాబాద్‌లో ఆకస్మిక తనిఖీ చేశారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 20 July 2026 8:07 AM IST
Guntakal
X

Guntakal: మోదినాబాద్‌లో గుంతకల్లు కమిషనర్ లక్ష్మీ దేవి తనిఖీలు

Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లు పురపాలక సంఘం 37వ వార్డు మోదినాబాద్ ఏరియా లో సోమవారం మున్సిపల్ కమిషనర్ లక్ష్మీ దేవి గారు ఆకస్మిక పర్యటన చేశారు.

ఈ సందర్భంగా ఆమె ఆ ప్రాంతంలో జరుగుతున్న శానిటేషన్ యాక్టివిటీస్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోడ్లపై చెత్త, మురుగునీరు నిల్వ, పారిశుధ్య కార్మికుల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు.

ప్రాంతంలోని ప్రధాన సమస్య అయిన డ్రైన్ సమస్య ను స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. మురుగునీరు రోడ్లపైకి రావడం, దుర్వాసనతో ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు వివరించారు.

సమస్యను పరిశీలించిన అనంతరం కమిషనర్ లక్ష్మీ దేవి వెంటనే స్పందించి ఇంజనీరింగ్ మరియు శానిటేషన్ అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. డ్రైన్ సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని, పూడిక తీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

శానిటేషన్ పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని, ప్రతిరోజూ పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL

Next Story