Guntakal: గుంతకల్లులో అన్న క్యాంటీన్ తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్
Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లులో మున్సిపల్ కమిషనర్ లక్ష్మీ దేవి అన్న క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, ఆహార నాణ్యత పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.
Guntakal: గుంతకల్లులో అన్న క్యాంటీన్ తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్
గుంతకల్లు అన్న క్యాంటీన్ ను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ లక్ష్మీ దేవి
- ఆహార నాణ్యత, పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి
గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ను మున్సిపల్ కమిషనర్ లక్ష్మీ దేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె వెంట AE హరికృష్ణ ఉన్నారు.
కమిషనర్ క్యాంటీన్ లోని వంటగది, స్టోర్ రూమ్, భోజన హాలును పరిశీలించారు. వండుతున్న ఆహార పదార్థాల నాణ్యత, శుభ్రత, వినియోగిస్తున్న సరుకుల నిల్వలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ లక్ష్మీ దేవి మాట్లాడుతూ, అన్న క్యాంటీన్ కు వచ్చే పేద ప్రజలకు రుచికరమైన, పౌష్టికమైన ఆహారాన్ని సకాలంలో అందించాలని సిబ్బందికి సూచించారు. క్యాంటీన్ పరిసరాల్లో పరిశుభ్రతను పాటించాలని, ప్రతిరోజూ ఆహార నాణ్యతను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు.
క్యాంటీన్ కు వచ్చే లబ్ధిదారులతో మాట్లాడి ఆహారం, సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, క్యాంటీన్ సిబ్బంది పాల్గొన్నారు.




