Guntakal: సాయి నగర్లో శానిటేషన్ విసిట్ చేసిన కమిషనర్ లక్ష్మీ దేవి!
Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని 11వ వార్డు సాయి నగర్లో మున్సిపల్ కమిషనర్ లక్ష్మీ దేవి శానిటేషన్ విసిట్ నిర్వహించారు.
Guntakal: సాయి నగర్లో శానిటేషన్ విసిట్ చేసిన కమిషనర్ లక్ష్మీ దేవి!
Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణ పురపాలక సంఘం 11వ వార్డు సాయి నగర్ ఏరియాలో మున్సిపల్ కమిషనర్ లక్ష్మీ దేవి శానిటేషన్ విసిట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె వీధుల్లోని డ్రైనేజీలు, చెత్త సేకరణ, మురుగు కాలువల శుభ్రత, వీధి దీపాల పనితీరును పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
కమిషనర్ లక్ష్మీ దేవి మాట్లాడుతూ, వర్షాకాలం దృష్ట్యా దోమల నివారణకు ప్రతి వీధిలో ఫాగింగ్, బ్లీచింగ్ పౌడర్ చల్లడం తప్పనిసరిగా చేయాలని సిబ్బందికి ఆదేశించారు. ఇళ్ల ముందు చెత్త పోగుపడకుండా చూడాలని, ప్రజలు కూడా ఇంటి చెత్తను శానిటేషన్ సిబ్బందికి మాత్రమే అందించాలని సూచించారు.
ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని, వార్డులో పారిశుద్ధ్య పనులను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ తనిఖీలో మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ సూపర్వైజర్లు పాల్గొన్నారు.




