Guntakal: మున్సిపల్ ఎన్నికల సన్నాహాలు అధికారులకు డీఎస్పీ కీలక సూచనలు!
Guntakal: గుంతకల్లులో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసు, మున్సిపల్ అధికారుల సమన్వయ సమావేశం. డీఎస్పీ బి. శ్రీనివాసరావు ఆదేశాలు.
Guntakal: మున్సిపల్ ఎన్నికల సన్నాహాలు అధికారులకు డీఎస్పీ కీలక సూచనలు!
గుంతకల్లు: రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని గుంతకల్లు డీఎస్పీ బి. శ్రీనివాసరావు సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
గుంతకల్లు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ మల్లెల లక్ష్మీదేవి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నామినేషన్ల దాఖలు, పరిశీలన, తిరస్కరణ ప్రక్రియల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.
నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటంతో పాటు, మున్సిపల్ కార్యాలయ పరిసరాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించేలా సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ పేర్కొన్నారు.
ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీసు, మున్సిపల్ శాఖల అధికారులు పరస్పర సహకారంతో విధులు నిర్వహించాలని సూచించారు.
ఈ సమావేశంలో గుంతకల్లు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వి. శ్రీధర్, టూటౌన్ ఇన్‌స్పెక్టర్ రమేష్ కుమార్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




