Guntakal: గుంతకల్లు మున్సిపల్ చైర్మన్‌గా యశోద గౌడ్ నామినేషన్!

Guntakal: గుంతకల్లు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రామగోని యశోద గౌడ్ నామినేషన్ దాఖలు చేశారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 18 Oct 2026 1:50 PM IST
Guntakal
X

Guntakal: గుంతకల్లు మున్సిపల్ చైర్మన్‌గా యశోద గౌడ్ నామినేషన్!

గుంతకల్లు: అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా రామగొను యశోద గౌడ్ ఈరోజు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, పామిడికి చెందిన కూటమి నాయకులు, ఇతర నాయకులతో కలిసి గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకున్న ఆమె ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆమెకు మద్దతు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో యశోద గౌడ్ నామినేషన్ దాఖలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL