Guntakal: గుంతకల్లో అక్రమ స్కూల్ హాస్టల్‌పై నిరసన
Guntakal: అనంతపురం జిల్లా గుంతకల్ తిలక్ నగర్‌లోని సక్సెస్ హై స్కూల్ ఎదుట పి.డి.ఎస్.యు విద్యార్థి సంఘం భారీ ధర్నా.
Guntakal: గుంతకల్లో అక్రమ స్కూల్ హాస్టల్‌పై నిరసన
గుంతకల్: ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో సరైన మౌలిక సదుపాయాలు లేని సక్సెస్ హై స్కూల్ పైన్ తక్షణమే చర్యలు తీసుకోవాలి అని ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పి. డి.ఎస్.యు నియోజకవర్గ కార్యవర్గ సభ్యుడు బి.రాజేష్ మాట్లాడుతూ గుంతకల్ పట్టణంలో తిలక్ నగర్ లో ఉన్నటువంటి సక్సెస్ హై స్కూల్ కు సరైన మౌలిక సదుపాయాలు లేకుండా అదే విధంగా పిల్లలకు ఆడుకోవడానికి గ్రౌండ్ లేని స్కూల్లో నడుపుతూ.
అక్రమంగా హాస్టల్ ను నిర్వహించుకొని విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర మొత్తం పిలుస్తూ వేలకు వేల రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులకు గురి చేసినటువంటి. సక్సెస్ హై స్కూల్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం గా మేము డిమాండ్ చేస్తున్నాం లేనిపక్షంలోన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చూస్తామని తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పి.డి.ఎస్.యు పట్టణ నాయకులు సాయి,ప్రభాస్,సుభాష్,మనోజ్,రోహిత్, పవన్,ఉమేష్, నరసింహ, తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.




