Guntakal: వైసీపీకి షాక్.. టీడీపీలోకి చేరిన మార్కెట్ యార్డ్ చైర్మన్!
Guntakal: అనంతపురం జిల్లా గుత్తి మండలం జక్కల చెరువు గ్రామంలో వైసిపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Guntakal: వైసీపీకి షాక్.. టీడీపీలోకి చేరిన మార్కెట్ యార్డ్ చైర్మన్!
Guntakal: అనంతపురం జిల్లా గుత్తి మండలం జక్కల చెరువు గ్రామం నందు గుంతకల్లు నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారు మరియు ఆయన తనయుడు, యువనేత,గుత్తి మరియు పామిడి ఇంచార్జ్ శ్రీ గుమ్మనూరు ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో గుత్తి మండలం జక్కల చెరువు గ్రామానికి చెందిన వైసిపి నాయకులు గుత్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కల చెరువు ప్రతాప్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా 20 కుటుంబాలు వైసిపి పార్టీ వీడి టిడిపి పార్టీలోకి చేరడం జరిగింది ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు మరియు గుమ్మనూరు ఈశ్వర్ గారు టిడిపి పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమం చూసి మరియు గుంతకల్ నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారు మరియు యువనేత శ్రీ గుమ్మనూరు ఈశ్వర్ గారు కార్యకర్తల కోసం పడుతున్న కష్టం మరియు కార్యకర్తలకు ఆయన ఇస్తున్న గౌరవం చూసి ఈరోజు టిడిపి పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు.
ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థలలో తమ వంతుగా గుమ్మనూరు జయరాం గారికి కష్టపడి పనిచేసి స్థానిక సంస్థల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు.
అనంతరం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్ర సీఎం కి సాధ్యం కాని రీతిలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీర్చిదిద్దుతున్నారని అందుకే ప్రజలు టీడీపీ పార్టీ కి ఆకర్షితులవుతున్నారు అని తెలియజేశారు అలాగే యువనేత శ్రీ గుమ్మనూరు ఈశ్వర్ గారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మన భవిష్యత్తు తరాల కోసం పనిచేస్తున్నారని,
కచ్చితంగా రాబోయే 2029 ఎన్నికల్లో కూడా మళ్లీ కూటమి ప్రభుత్వం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు అలాగే గుంతకల్లు నియోజకవర్గం లో వైసీపీ పార్టీ ఖాళీ అవుతుందని రాబోయే రోజుల్లో కూడా మరిన్ని చేరికలు ఉంటాయని మంచికి అండగా నిలిచే వారిని కచ్చితంగా పార్టీలో చేర్చుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గారు యువనేత ఈశ్వర్ గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుత్తి మండల మరియు పట్టణ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు జక్కల చెరువు గ్రామ ప్రజలు అనుబంధ కమిటీ సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




