Guntakal: రాష్ట్రస్థాయి 100 మీటర్ల పరుగులో గుంతకల్లు కుర్రాడి సత్తా.. గోల్డ్ మెడల్ కైవసం!

Guntakal: అమరావతి ఛాంపియన్ పోటీల్లో 100 మీటర్ల పరుగును 10.79 సెకన్లలో పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించిన గుంతకల్లు యువకుడు టి. రాజేష్‌ను ఎమ్మెల్యే జయరాం సత్కరించారు.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 12 Sept 2026 9:58 PM IST
Guntakal
X

Guntakal: రాష్ట్రస్థాయి 100 మీటర్ల పరుగులో గుంతకల్లు కుర్రాడి సత్తా.. గోల్డ్ మెడల్ కైవసం!

గుంతకల్లు: అమరావతి ఛాంపియన్ క్రీడల పోటీల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన టి. రాజేష్ రాష్ట్రస్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి 100 మీటర్ల పరుగు పందెంలో ప్రథమ స్థానాన్ని సాధించాడు. అండర్-18 విభాగంలో పాల్గొన్న రాజేష్ కేవలం 10.79 సెకన్లలో 100 మీటర్ల పరుగు పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించడం విశేషం.

నియోజకవర్గ స్థాయి పోటీల్లో విజయం సాధించిన రాజేష్ జిల్లా స్థాయి పోటీల్లోనూ ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించాడు. రాష్ట్రస్థాయిలోనూ తన ప్రతిభను చాటుకుని ప్రథమ స్థానం సాధించడంతో గుంతకల్లు పట్టణానికి మంచి పేరు తీసుకొచ్చాడు.

ఈ సందర్భంగా శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం రాజేష్‌ను ఘనంగా సత్కరించారు. రాష్ట్రస్థాయిలో 100 మీటర్ల పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించడం అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి గుంతకల్లు పట్టణానికి, నియోజకవర్గానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

రాజేష్ క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ తరఫున కూడా అభినందనలు అందాయని తెలిపారు. క్రీడల్లో యువత మరింతగా రాణించేలా ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్. రామాంజనేయులు (అంజి), హెడ్ కోచ్ దామోదర్ రెడ్డి, చీఫ్ కోచ్ దొరై స్వామి తదితరులు పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL