Guntakal: జిల్లా స్థాయి ఉత్తమ 'స్వచ్ఛ రథ' ఆపరేటర్ అవార్డు అందుకున్న నారాయణ
Guntakal: అనంతపురంలో జరిగిన కార్యక్రమంలో వజ్రకరూరు స్వచ్ఛ రథ ఆపరేటర్ నారాయణ జిల్లా స్థాయి బెస్ట్ ఆపరేటర్ అవార్డు అందుకున్నారు. మిత్రులు అభినందనలు తెలిపారు.
Guntakal: జిల్లా స్థాయి ఉత్తమ 'స్వచ్ఛ రథ' ఆపరేటర్ అవార్డు అందుకున్న నారాయణ
గుంతకల్లు: గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత కార్యక్రమాల్లో ఉత్తమ సేవలు అందించిన స్వచ్ఛ రథ ఆపరేటర్లను జిల్లా స్థాయిలో గుర్తించి అవార్డులతో సత్కరించారు. ఇందులో భాగంగా అనంతపురం పట్టణంలోని అలెగ్జాండర్ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వజ్రకరూరు గ్రామానికి చెందిన స్వచ్ఛ రథ ఆపరేటర్ హెచ్. నారాయణకు జిల్లా స్థాయి బెస్ట్ ఆపరేటర్ అవార్డు లభించింది.
వజ్రకరూరు గ్రామంలో స్వచ్ఛ రథ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న హెచ్. నారాయణ, గ్రామంలో ప్రతిరోజూ చెత్త సేకరణ, పారిశుద్ధ్య నిర్వహణతో పాటు స్వచ్ఛత కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారు. ఆయన అందిస్తున్న ఉత్తమ సేవలను గుర్తించిన అధికారులు జిల్లా స్థాయిలో బెస్ట్ ఆపరేటర్‌గా ఎంపిక చేశారు.
అనంతపురం పట్టణంలోని అలెగ్జాండర్ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్సీ దళవాయి రమాదేవి, షిరిడి సాయి స్వీట్స్ యజమాని భవాని తదితరుల చేతుల మీదుగా హెచ్. నారాయణ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అందిస్తున్న సేవలను పలువురు కొనియాడారు.
2005 పదో తరగతి బ్యాచ్ మిత్రుల అభినందనలు
హెచ్. నారాయణకు జిల్లా స్థాయిలో ఉత్తమ ఆపరేటర్ అవార్డు లభించడంతో ఆయనతో చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్న వజ్రకరూరు జడ్పీ హైస్కూల్ 2005 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. తమ చిన్ననాటి మిత్రుడు జిల్లా స్థాయిలో గుర్తింపు పొందడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు.
ఈ సందర్భంగా హెచ్. నారాయణకు ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసిన 2005 పదో తరగతి బ్యాచ్ మిత్రులు, ఆయన జీవితంలో మరెన్నో అవార్డులు అందుకోవాలని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.




