Anantapur: డబ్బు ఆశ చూపి మట్కా.. గుట్టు రట్టు చేసిన గుత్తి పోలీసులు

Anantapur: అనంతపురం జిల్లా గుత్తిలో మట్కా నిర్వహిస్తూ, గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL
Published on: 13 May 2026 9:38 PM IST
Anantapur
X

Anantapur: డబ్బు ఆశ చూపి మట్కా.. గుట్టు రట్టు చేసిన గుత్తి పోలీసులు

Anantapur: ప్రజలకు డబ్బు ఆశ చూపిస్తూ మట్క నిర్వహిస్తూ మరోవైపు గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను అనంతపురం జిల్లా గుత్తి పోలీసులు అరెస్టు చేశారు. గుత్తి పట్టణానికి చెందిన మాతంగి రాము , కంబగిరి, శివ అను వారి నుండి మూడు లక్షల నగదు మట్కా చీటీలు , కేజిన్నర గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సందర్భంగా గుత్తి సీఐ రామారావు మాట్లాడుతూ రాబడిన సమాచారం మేరకు మట్కా నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ సంఘటనలో మరో ముగ్గురు పరారైనట్టు వారికోసం గాలిస్తున్నట్టు సీఐ తెలిపారు.

LALU PRASAD NAYAK, GUNTAKAL

LALU PRASAD NAYAK, GUNTAKAL

Next Story