Dharmavaram: పోలీసులతో తోపులాట, భారీగా నిలిచిన ట్రాఫిక్!
Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో చేనేత కార్మికులు రహదారిపై బైఠాయించి భారీ ధర్నా చేశారు.
Dharmavaram: పోలీసులతో తోపులాట, భారీగా నిలిచిన ట్రాఫిక్!
ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో చేనేత కార్మికులు ధర్నా చేశారు. ఇటీవల నేతన్న సేవలో పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించగా ఇంతవరకు తమ 25000/-అకౌంట్లో డబ్బులు జమ కాలేదని చేనేత కార్మికులు కదిరిగేటి వద్ద బత్తలపల్లి ధర్మవరం రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు.
చేనేత కార్మికుల ధర్నాతో భారీగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు చేరుకొని కార్మికులను బలవంతంగా పంపించడానికి ప్రయత్నం చేశారు. ఈ ఘటనతో కార్మికులు పోలీసుల మధ్య తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.




