Anantapur: జగన్ ఒక నిలకడ లేని మనిషి.. నా రక్తంలోనే బీజేపీ ఉంది: మంత్రి

Anantapur: ప్రభుత్వ ఆసుపత్రిలో వీల్ చైర్ కోసం సెల్‌ఫోన్ తాకట్టు పెట్టిన ఘటనపై విచారణకు ఆదేశించామని, తప్పుడు ప్రచారం చేసే యూట్యూబర్లపై చర్యలు

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 6 July 2026 8:53 PM IST
Anantapur
X

Anantapur: జగన్ ఒక నిలకడ లేని మనిషి.. నా రక్తంలోనే బీజేపీ ఉంది: మంత్రి

అనంతపురం: ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన సంఘటనపై విచారణ చేయించి తగిన బాధ్యతలపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ చెప్పారు సెల్ఫోన్ తాకట్టుపెట్టి వీల్ చైర్ ఇచ్చిన సంఘటన బాధాకరమని ఈ విషయంలో డి ఎం ఈ ని పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు అయితే ఆసుపత్రి ప్రాంతంలో కొంతమంది యూట్యూబ్లో తప్పుడు సమాచారాలను ప్రజలకు చేరవేస్తూ ఆసుపత్రి నిర్వహణ విషయాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు ఇలాంటి వారి పైన చర్యలు తీసుకుంటామన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినమైన నిర్ణయాలు అమలు చేస్తామని తెలిపారు.

అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వైఎస్ఆర్‌సీపీ నేతలపై, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాజకీయ విమర్శలు & సిద్ధాంతాలు

పేర్ని నాని ఒక అవకాశవాది పేర్ని నాని లాంటి వాళ్ళు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటారు. ఆయన అవకాశం కోసం పార్టీలు మారే వ్యక్తి, నేను కాదు.

నా రక్తంలోనే బీజేపీ ఉంది: సత్యకుమార్ రక్తంలోనే బీజేపీ, కషాయం రంగు ఉన్నాయి. నేను సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవాడిని, అవకాశవాదిని కాదు. ఒక మంత్రిగా చెబుతున్నా... కూటమి ప్రభుత్వంపై ఎవరైనా అనవసర విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోను. నేను సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిని.

జగన్‌పై వ్యక్తిగత నేను జగన్‌ను వ్యక్తిగతంగా ఎప్పుడూ తిట్టలేదు. కేవలం ఆయనకున్న వ్యతిరేక సిద్ధాంతాలపైనే మాట్లాడుతాను. జగన్ ఒక నిలకడ లేని మనిషి. రాజధాని అమరావతి పనులు తొందర్లోనే పూర్తి అవుతాయి.

క్యాపిటల్ (రాజధాని) పై జగన్ మాట్లాడుతుంటే ఆయనకు అవగాహన లోపించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. చేతనైతే జగన్‌ను తన మాటపై నిలబడి ఎన్నికలకు వెళ్ళమనండి, అప్పుడు చూద్దాం.గత ప్రభుత్వం కంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనే ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం.ఇంకా కొన్ని చోట్ల వైద్య సేవల్లో మార్పు రావాల్సి ఉంది. దానికోసం నిరంతరం కృషి చేస్తున్నాం.

ఫిర్యాదులపై తక్షణ చర్యలు ప్రజల నుంచి వస్తున్న ప్రతి ఒక్క ఫిర్యాదుపై తక్షణమే స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నాం.

ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM

Next Story