Dharmavaram: ధర్మవరంలో మడుగుతేరు కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరు
Dharmavaram: ధర్మవరంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి మడుగుతేరు కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Dharmavaram
Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన మడుగుతేరు కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి, రాష్ట్రంలోని రైతులు, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థించారు. శతాబ్దాల చరిత్ర గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవంలో ముఖ్య భాగమైన మడుగుతేరు కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా మంత్రితో పాటు పాల్గొన్నారు.
Next Story




