OD Cheruvu: కుంట్లపల్లి రోడ్డుపై విరిగిపడ్డ భారీ వృక్షం.. గంటల తరబడి ట్రాఫిక్ జామ్!
OD Cheruvu: శ్రీ సత్యసాయి జిల్లా ఓ.డి.చెరువు మండలం కుంట్లపల్లి రహదారిపై గాలివాన కారణంగా భారీ చెట్టు విరిగిపడి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
OD Cheruvu: కుంట్లపల్లి రోడ్డుపై విరిగిపడ్డ భారీ వృక్షం.. గంటల తరబడి ట్రాఫిక్ జామ్!
OD Cheruvu: ఓ.డి.చెరువు మండలం కుంట్లపల్లి ప్రధాన రహదారిపై కురిసిన గాలి, వర్షాలకు భారీ చెట్టు రోడ్డుపై కూలిపోవడంతో రాకపోకలు అంతరాయం కలిగింది. దీంతో కొన్ని గంటల సేపు వాహనదారులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి గంగాధర్ నాయక్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. వెంటనే పంచాయతీ కార్మికులను, స్థానిక యువకులను అప్రమత్తం చేసి చెట్టును తొలగించే పనులు చేపట్టారు. చెట్టు కొమ్మలను కట్ చేసి రహదారిని శుభ్రం చేయడంతో కొంతసేపటికే రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకున్న పంచాయతీ కార్యదర్శి గంగాధర్ నాయక్‌ను గ్రామస్తులు అభినందించారు. వర్షాకాలంలో ప్రమాదకరంగా ఉన్న పాత చెట్లను ముందస్తుగా తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.




