Dharmavaram: ధర్మవరం అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించండి!
Dharmavaram: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం 15వ వార్డు టీడీపీ అభ్యర్థి పోసిన చెన్నమ్మ తరఫున హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి ప్రచారం.
Dharmavaram: ధర్మవరం అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించండి!
Dharmavaram: ధర్మవరం పట్టణం 15వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి పోసిన చెన్నమ్మకు మద్దతుగా హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి చెన్నమ్మను గెలిపించాలని అభ్యర్థించారు.
గత వైసీపీ ప్రభుత్వంలో పట్టణం ఎటువంటి అభివృద్ధి సాధించలేదని కూటమి అభ్యర్థులను గెలిపించి పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు. ఎంపీ వెంట బీజేపీ టీడీపీ నాయకులు పాల్గొన్నారు.




