Kasapuram: కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు!
Kasapuram: కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో అమావాస్య సందర్భంగా భక్తుల రద్దీ. స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు.. దర్శనానికి బారులు తీరిన భక్తులు.
Kasapuram: కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు!
కసాపురం: అనంతపురం జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కసాపురంలో శుక్రవారం అమావాస్య సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది.
11-09-2026 శుక్రవారం అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనార్థం తరలివచ్చారు. ఉదయం నుంచే ఆలయంలో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. అమావాస్య సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.




