Bommanahal: శ్రీధరగట్ట చెరువులో అక్రమ మట్టి దందా!

Bommanahal: బొమ్మనహాల్ మండలం శ్రీధరగట్ట చెరువులో మైనర్ ఇరిగేషన్ అధికారుల కనుసన్నల్లో అక్రమ మట్టి తవ్వకాలు.

M. MITHRAM, ANANTAPURURAM
Published on: 24 July 2026 1:34 PM IST
Bommanahal
X

Bommanahal: శ్రీధరగట్ట చెరువులో అక్రమ మట్టి దందా!

Bommanahal: నియోజకవర్గం లోని బొమ్మనహాల్ మండలం శ్రీధరగట్ట గ్రామంలోని చెరువులో అధికారుల అనుమతులు ఉన్నాయంటూ మైనర్ ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వలన బరి తెగించి నిబంధనలకు విరుద్ధం గా దాదాపు 20 అడుగుల లోతు వరకు భారీ గుంతలు పెట్టి అక్రమార్కులు భారీగా మట్టి ని తరలిస్తూ దందా కు పాల్పడుతున్నట్టు గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.

రోజుకు జేసీబీ, హిటాచీలు కూడా సుమారు 5 దాకా పెట్టి ఎవరికీ ఇష్టం వచ్చిన చోట వారు గుంతలు పెడుతూ పదుల సంఖ్యలో ట్రాక్టర్ లు, టిప్పర్ లు పెట్టి బయటకు తరలిస్తున్నట్టు సమాచారం. నిత్యం పరిరక్షించి నిబంధనల ప్రకారం మట్టిని తవ్వాలని సూచించాల్సిన మైనర్ ఇరిగేషన్ అధికారులు అక్రమార్కులు ఇచ్చిన కాసులకు కక్కుర్తి పడి అటువైపు చూడలేదని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. కావున ఇప్పటికైనా సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి నిబంధనలకు విరుద్ధంగా గుంతలు పెట్టిన అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

M. MITHRAM, ANANTAPURURAM

M. MITHRAM, ANANTAPURURAM

Next Story