Penukonda: పెనుకొండలో భోగసముద్రం చెరువు మట్టి అక్రమ రవాణా!
Penukonda: శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని భోగసముద్రం చెరువు నుంచి ఇటుక బట్టీలకు ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు.
Penukonda: పెనుకొండలో భోగసముద్రం చెరువు మట్టి అక్రమ రవాణా!
Penukonda: శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ : శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండలోని భోగసముద్రం చెరువు నందు నీటి శాతం పూర్తిగా తగ్గిపోవడం వల్ల మట్టి అక్రమ రవాణా జరుగుతున్నది ఇటుకల భట్టీలకు వారి నిర్వాహకులు ఎటువంటి అనుమతులు లేకుండా పూర్తిస్థాయిలో మట్టిని సరఫరా చేసుకుంటున్నారు. గతంలో ఇరిగేషన్ శాఖ వారు చూపించిన బౌండరీస్ ను కూడా ఏమాత్రం లెక్క చేయకుండా ప్రతిరోజు 40 ట్రాక్టర్లకు పైగా మట్టిని అక్రమంగా తీసుకొని పోతున్నారు.
ఈ విధంగా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి పెనుకొండ కోట కూడా పూర్తిస్థాయిలో దెబ్బతినే ప్రమాదం ఉన్నది చెరువు పూర్తిస్థాయిలో నిండితే చెరువుకు గండి పడే ప్రమాదం కూడా ఉన్నది చెరువు కింద ఉన్న పొలాలు గాని భవనాలు గాని నీట మునిగే ప్రమాదం ఉన్నది కావున దీనిమీద అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానిక ప్రజలందరూ కోరుతున్నారు




