Guntakal: టీడీపీలో చేరిన స్వతంత్ర కౌన్సిలర్లు కృష్ణ నాయక్, శరణ్య!
Guntakal: గుంతకల్లు మున్సిపాలిటీలో 41, 43 వార్డుల స్వతంత్ర కౌన్సిలర్లు కృష్ణ నాయక్, డి. శరణ్య టీడీపీలో చేరిక. కండువా కప్పి ఆహ్వానించిన జితేంద్ర గౌడ్, యశోద గౌడ్.
Guntakal: టీడీపీలో చేరిన స్వతంత్ర కౌన్సిలర్లు కృష్ణ నాయక్, శరణ్య!
Guntakal: గుంతకల్లు మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించిన 41వ వార్డు కౌన్సిలర్ కృష్ణ నాయక్, 43వ వార్డు కౌన్సిలర్ డి. శరణ్య తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే రామగౌని జితేంద్ర గౌడ్ నివాసంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, మున్సిపల్ చైర్మన్ యశోద గౌడ్ వారికి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ మాట్లాడుతూ ప్రజల ఆశీర్వాదంతో స్వతంత్ర అభ్యర్థులుగా విజయం సాధించిన కౌన్సిలర్లు టీడీపీలో చేరడం సంతోషకరమన్నారు. వారి చేరికతో గుంతకల్లు మున్సిపాలిటీలో టీడీపీ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. వార్డుల అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
మున్సిపల్ చైర్మన్ యశోద గౌడ్ మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధితో పాటు ప్రతి వార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా కౌన్సిలర్లందరూ సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు పవన్ గౌడ్‌తో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




