ఇన్‌స్టాగ్రామ్ వీడియో ఎఫెక్ట్: మూతపడిన స్కూల్ రీఓపెన్‌కు మంత్రి లోకేష్ ఆదేశం!

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రత్నే నాయక్ తండాలో పాఠశాల మూసివేతపై ఇన్స్టాగ్రామ్ వీడియో వైరల్.

P.RAHAMTULLA, KADIRI
Published on: 27 July 2026 11:00 AM IST
ఇన్‌స్టాగ్రామ్ వీడియో ఎఫెక్ట్: మూతపడిన స్కూల్ రీఓపెన్‌కు మంత్రి లోకేష్ ఆదేశం!
X

ఇన్‌స్టాగ్రామ్ వీడియో ఎఫెక్ట్: మూతపడిన స్కూల్ రీఓపెన్‌కు మంత్రి లోకేష్ ఆదేశం!

కదిరి (శ్రీ సత్యసాయి జిల్లా): తనకల్లు మండలం రత్నే నాయక్ తండాలో పాఠశాల మూసివేతతో చిన్నారులు విద్యకు దూరమవుతున్న పరిస్థితిని స్థానికులు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో రూపంలో పోస్టు చేశారు. ఈ వీడియో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి చేరడంతో వెంటనే స్పందించిన మంత్రి, సంబంధిత అధికారులతో మాట్లాడి పాఠశాల పునఃప్రారంభానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని, త్వరలోనే పాఠశాల ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మంత్రి స్పందనతో రత్నే నాయక్ తండా ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. తమ సమస్యను సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగానే సత్వర స్పందన రావడం పట్ల తండావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల భవిష్యత్తు దృష్ట్యా పాఠశాలను త్వరగా ప్రారంభించాలని కోరుతున్నారు. ఈ ఘటన మరోసారి సోషల్ మీడియా ప్రజా సమస్యల పరిష్కారానికి సమర్థవంతమైన వేదికగా మారిందని చాటిచెబుతోంది.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story