Puttaparthi: పుట్టపర్తి మున్సిపల్‌పై పీఠం పోరు.. హోరెత్తుతున్న కూటమి, వైఎస్సార్‌సీపీ ప్రచారం!

Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపల్ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. చైర్మన్ పీఠమే లక్ష్యంగా కూటమి, వైఎస్సార్‌సీపీ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి.

L.Sudhakar, Puttaparthy
Published on: 25 Oct 2026 1:22 PM IST
Puttaparthi
X

Puttaparthi: పుట్టపర్తి మున్సిపల్‌పై పీఠం పోరు.. హోరెత్తుతున్న కూటమి, వైఎస్సార్‌సీపీ ప్రచారం!

Puttaparthi: పుట్టపర్తి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది.చైర్మన్ పీఠమే లక్ష్యంగా కూటమి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇంటింటి ప్రచారం, ఓటర్లను కలుసుకోవడం, అభివృద్ధి హామీలతో ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు ఇరు పార్టీల అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు.శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీలో గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ఇరుపార్టీల అభ్యర్థులు ముమ్మరం చేశారు.

కూటమి అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే సింధూర, మాజీ మంత్రి ప్రచారం జనసేన చైర్మన్ అభ్యర్థి మేకల ఈశ్వర్ గెలుపే లక్ష్యంగా కూటమి నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.ఎమ్మెల్యే పల్లె సింధూర, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వార్డుల్లో పర్యటిస్తూ ఓటర్లను కలుస్తున్నారు.చైర్మన్ అభ్యర్థి మేకల ఈశ్వర్‌కు గ్లాస్ గుర్తుపై, కౌన్సిలర్ అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు.

ఎన్నికల్లో గెలిపిస్తే పుట్టపర్తి మున్సిపాలిటీలో ప్రధాన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానంటున్న చైర్మన్ అభ్యర్థి మేకల ఈశ్వర్.ముఖ్యంగా డ్రైనేజీ, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తానని ఓటర్లకు హామీ ఇస్తున్నారు.మరోవైపు వైఎస్సార్‌సీపీ చైర్మన్ అభ్యర్థి బోయ వనం అవినాష్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కోవెలగుట్టపల్లి, రాయలవారిపల్లి, పుట్టపర్తి పట్టణంలోని వివేకానంద రోడ్డులో విస్తృతంగా పర్యటిస్తున్నారు.స్థానికులను కలుస్తూ, పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటూ తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.

తాను గెలిస్తే ప్రణాళికాబద్ధంగా పుట్టపర్తి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తానని బోయ వనం అవినాష్ హామీ ఇస్తున్నారు. ప్రతి వార్డులో పర్యటిస్తూ స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేస్తానని చెబుతున్నారు.ప్రజలతో నిత్యం మమేకమయ్యేందుకు ‘గుడ్ మార్నింగ్’ పేరుతో నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తానని ప్రకటించారు.

అంతేకాదు మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇస్తున్నారు.ఒకవైపు కూటమి అభ్యర్థి డ్రైనేజీ, తాగునీటి సమస్యల పరిష్కారాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తుంటే.. మరోవైపు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.

దీంతో పుట్టపర్తి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం ఆసక్తికరంగా మారింది.ఓటర్లు ఎవరికి మద్దతుగా నిలుస్తారు,ఏ పార్టీ అభ్యర్థులకు పట్టం కడతారు అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

L.Sudhakar, Puttaparthy

L.Sudhakar, Puttaparthy