Anantapur: అల్లర్లతో గెలవాలని జగన్ చూస్తున్నారు: ఎమ్మెల్యే దగ్గుపాటి

Anantapur: రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి మళ్లీ అధికారంలోకి రావాలని జగన్ చూస్తున్నారని, ఆయన తుగ్లక్ పాలన వల్లే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శించారు.

ANIL KUMAR, ANANTHAPURAM
Published on: 26 Oct 2026 11:51 PM IST
Anantapur
X

Anantapur: అల్లర్లతో గెలవాలని జగన్ చూస్తున్నారు: ఎమ్మెల్యే దగ్గుపాటి

Anantapur: రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి మరోసారి అధికారంలోకి రావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విమర్శించారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని ఏడో డివిజన్‌లో కూటమి మేయర్ అభ్యర్థి అజేష్ బాబు, టీడీపీ డివిజన్ అభ్యర్థి సతీష్ గజపతిరాజుకు మద్దతుగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వైసిపీ ప్రభుత్వ హయాంలో జగన్ తుగ్లక్ పాలన సాగించారని, ప్రజాగ్రహంతోనే ఎన్నికల్లో ఆ పార్టీ 11 సీట్లకు పరిమితమైందని విమర్శించారు.అయినా వైసీపీ నాయకులు మరోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తూ, ఎన్నికలను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.కోర్టులను ఆశ్రయించినా ఫలితం లేకపోవడంతో మళ్లీ అల్లర్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలను పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించకుండా ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించారని దగ్గుపాటి ప్రసాద్ ఆరోపించారు.అయితే ప్రస్తుత ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM