Pamidi: ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో జనసేనకు సీట్లు ఇవ్వాలని వినతి!

Pamidi: పామిడిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో జనసేనకు అవకాశం కల్పించాలని టీడీపీ నేత గుమ్మనూరు ఈశ్వర్‌కు జనసేన నాయకుల వినతి.

V.LALU NAIK, GUNTAKAL
Published on: 20 Oct 2026 3:01 PM IST
Pamidi
X

Pamidi: ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో జనసేనకు సీట్లు ఇవ్వాలని వినతి!

పామిడి: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో జనసేన పార్టీకి కూడా అవకాశం కల్పించాలని కోరుతూ జనసేన పార్టీ గుంతకల్లు నియోజకవర్గ స్థానిక ఎన్నికల కో-కమిటీ నిర్వాహక్ దళ్ సభ్యులు రోషన్ జమీర్, ఖాజా వలి, సూర్య ప్రకాష్ ఆధ్వర్యంలో గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనయుడు, గుత్తి–పామిడి మండలాల తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి గుమ్మనూరు ఈశ్వర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.

కూటమిలో భాగంగా జనసేన పార్టీకి కూడా ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వడ్డే రాము, కత్రిమల సుబ్బు, కొట్టాల సూరి తదితరులు పాల్గొన్నారు.

V.LALU NAIK, GUNTAKAL

V.LALU NAIK, GUNTAKAL