Tadipatri: తాడిపత్రి రాజకీయాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్!

Tadipatri: తాడిపత్రి అభివృద్ధి చేసే వారికే ఓట్లేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్య. వైఎస్సార్‌సీపీ నేతలపై ఆరోపణలు, స్థానిక ఎన్నికల్లో మహిళలకు 34 సీట్ల ఆఫర్.

ANIL KUMAR, ANANTHAPURAM
Updated on: 14 Oct 2026 1:07 PM IST
Tadipatri
X

Tadipatri: తాడిపత్రి రాజకీయాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్!

Tadipatri: తాడిపత్రి రాజకీయాల్లో మరోసారి హాట్ కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాడిపత్రి ప్రజలు వినూత్నంగా ఆలోచిస్తారని, పట్టణ అభివృద్ధికి కృషి చేసే వారిని గుర్తించి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు.

మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మున్సిపల్ స్థలంతో పాటు కోమటికుంట్ల గ్రామంలో భూమిని ఆక్రమించారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ నేత రమేష్ రెడ్డిపై కూడా భూకబ్జా ఆరోపణలు చేశారు.తన భార్య పేరు మీద అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించారని ఆరోపిస్తూ, రమేష్ రెడ్డి త్వరలో జైలుకు వెళ్తారని జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.అయితే, ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తుల స్పందన లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

స్థానిక ఎన్నికలపై జేసీ కీలక వ్యాఖ్యలు చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు ప్రాధాన్యత ఇస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. 34 మంది మహిళలకు అవకాశం కల్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.తెలంగాణకు చెందిన ఓ ఎన్నారై కుమారుడు గ్రామాలను దత్తత తీసుకున్నారని, మున్సిపల్ చైర్మన్ పదవికి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.

ఈ విషయంపై మంత్రి నారా లోకేష్‌తో మాట్లాడి చైర్మన్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తానని చెప్పారు.తాను కూడా కౌన్సిల్‌లో ఉంటానని, మాజీ ఎమ్మెల్యే, మాజీ చైర్మన్‌గా అడ్వైజర్‌గా అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తాడిపత్రిలో 48 మందితో ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు.తాడిపత్రి అభివృద్ధే నా లక్ష్యమని ఈజీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.తెలుగుదేశం పార్టీలో కొందరు నాయకులు పార్టీకి దూరమయ్యారని జేసీ వ్యాఖ్యానించారు.తన కోరిక ఒక్కటేనని, తన ఊరు బాగుండాలని అన్నారు. దేవుడు అన్నీ చూస్తున్నాడని వ్యాఖ్యానించారు.

ANIL KUMAR, ANANTHAPURAM

ANIL KUMAR, ANANTHAPURAM