Tadipatri: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Tadipatri: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించిన జేసీ.. అప్పటి అధికారులపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
వాయిస్ ఓవర్: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తమను ఎన్నికల్లో స్వేచ్ఛగా పోటీ చేయనీయలేదని ఆరోపించారు. అప్పట్లో ప్రజాస్వామ్యం లేదని, టీడీపీ నాయకులను పోలీసులు తీవ్రంగా వేధించారని మండిపడ్డారు.
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పైస్థాయి ఆదేశాలతో కొంతమంది పోలీసు అధికారులు బలవంతంగా రిగ్గింగ్ చేయించారని ఆరోపించారు. అప్పటి డీఎస్పీలు, సీఐలు కొన్ని చోట్ల ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేశారని, మరికొన్ని స్థానాల్లో బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయని విమర్శించారు.
అంతేకాకుండా, ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పట్లో వ్యవహరించిన అధికారులే తమకు సహకరించి ఏకగ్రీవాలు చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. తనపై వచ్చే విమర్శలపైనా జేసీ స్పందించారు. "నేను రౌడీనే... మాట్లాడే వారినే అందరూ రౌడీ అంటారు" అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.




