Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లా యువతకు గోల్డెన్ ఛాన్స్.. ఎయిర్‌పోర్టుల్లో ఉద్యోగం!

Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లాలోని యువతీ యువకులకు ప్రధాన విమానాశ్రయాల్లో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాల కోసం నెల రోజుల ప్రత్యేక శిక్షణను కలెక్టర్ శ్యాంప్రసాద్ ప్రకటించారు.

S.Firoz, Sri Sathya Sai
Published on: 12 Jun 2026 1:32 PM IST
Puttaparthi
X

Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లా యువతకు గోల్డెన్ ఛాన్స్.. ఎయిర్‌పోర్టుల్లో ఉద్యోగం!

పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లాలోని యువతీ యువకులకు ప్రధాన విమానాశ్రయాలు, పవర్ ప్రాజెక్ట్స్, టోల్ ప్లాజా ల దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. ఇందుకోసం హిందూపురం సమీపంలోని రక్ష అకాడమీ వారిచే నెల రోజులపాటు ప్రొఫెషనల్ శిక్షణ ఇస్తారని పేర్కొన్నారు.

శిక్షణానంతరం యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం వసతి కల్పిస్తారని తెలిపారు. యువతీ యువకులు తప్పనిసరిగా పదవ తరగతి లేదా ఆపై చదివిన వారు అర్హులని అన్నారు.

మహిళలకు 18 నుంచి 30 సంవత్సరాల లోపు, పురుషులకి 18 నుండి 35 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలని తెలిపారు. ఈ ప్రొఫెషనల్ శిక్షణ విజయవంతంగా పూర్తిచేసిన వారికి ప్రధాన విమానాశ్రయాలలో ఉద్యోగ అవకాశం కల్పిస్తారని అన్నారు.

శ్రీ సత్య సాయి జిల్లాలోని అర్హత కలిగిన యువతీ యువకులు, ఉద్యోగ అవకాశం కోసం వేచి చూసేవారు, ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని తెలియజేశారు. మరిన్ని వివరాల కొరకు 6281557937, 6300676517 నెంబర్లను సంప్రదించగలరు.

S.Firoz, Sri Sathya Sai

S.Firoz, Sri Sathya Sai

Next Story