Sri Sathya Sai: జర్నలిస్టులకు మద్దతుగా రాజకీయ పార్టీల గర్జన..
Sri Sathya Sai: అనంతపురం 'మనం' రిపోర్టర్ లక్ష్మీనారాయణపై భౌతిక దాడికి పాల్పడిన గీతం కాలేజీ నిర్వాహకురాలు మనీషా నాయర్.
Sri Sathya Sai: జర్నలిస్టులకు మద్దతుగా రాజకీయ పార్టీల గర్జన..
శ్రీ సత్యసాయి జిల్లా: రిపోర్టర్ లక్ష్మీనారాయణపై దాడి చేసిన మనీషా నాయర్ పై ఎస్సి అట్రాసిటీ కేసు నమోదు చేయాలి ఓ.డి చెరువు: అనంతపురం లో మనం రిపోర్టర్ గా పని చేస్తున్న లక్ష్మీనారాయణపై భౌతిక దాడులకు పాల్పడిన గీతం కాలేజి నిర్వాహకురాలు మనీషా నాయర్‌పై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఓ డి చెరువు మండల పాత్రికేయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం తాసిల్దార్ కార్యాలయంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నందు వినతి పత్రం అందజేశారు అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై మల్లికార్జున్రెడ్డికి వినతి పత్రం అందజేశారు వీరికి మద్దతుగా సిపిఐ, ఆర్ సి పి,కాంగ్రెస్, ఏపీ రైతు సంఘం నాయకులు మద్దతు పలికి నినాదాలు చేస్తూ కాలేజీ ప్రిన్సిపాల్ పై ఎస్సీ అల్ట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.ప్రిన్సిపాల్ తో పాటు ఆమె అనుచరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆర్ సి పి డివిజనల్ అధ్యక్షుడు మున్నా, ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు కదిరప్ప సిపిఎం మండల కార్యదర్శి చలపతి కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ సురేష్ మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు, అవినీతి, ఆరోపణలను ప్రజల ముందుకు తీసుకురావడం పాత్రికేయుల విధి ధర్మమని పేర్కొన్నారు. శ్రీ గీతం కళాశాల ప్రిన్సిపాల్ అవినీతి అక్రమాలపై మనం పాత్రికేయులు లక్ష్మీనారాయణ వ్రాసిన కథనాలపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. రాసిన కథనాలు నిజ నిర్ధారణకు అవసరమైతే కోర్టులు ఆచరించాలి కాని ఇలా భౌతిక దాడులకు పాల్పడడం క్షమించరాని నేరం అన్నారు.
వార్తపై అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా కోర్టును ఆశ్రయించి న్యాయం కోరవచ్చని, కానీ గుండాగిరి చేస్తూ ఇంటికి వెళ్లి భౌతిక దాడులకు పాల్పడటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్ట్‌ను అవమానించేలా కాళ్లు మొక్కించుకుని పైశాచిక ఆనందం పొందడం సమాజం తలదించుకునే ఘటన అన్నారు. ఇటీవలి కాలంలో జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్నాయని, సామాన్య ప్రజలకు రక్షణ కరువవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎపీ డబ్ల్యూజే నాయకులు పాత్రికేయులు షాజహాన్ బాషా, భుజంగరావు, రంగప్ప, లక్ష్మన్న, గోపీనాథ్ రెడ్డి ఫిరోజ్, చంద్రశేఖర్ రెడ్డి ఆదిమూర్తి, ఆంజనేయులు, మహేశ్వర్ రెడ్డి, ఆనంద్,రాజు ఆంజనేయులు, ఫయాజ్ భాష తదితరులు పాల్గొన్నారు.




