Sri Sathya Sai: తల్లి, బిడ్డ చావులకు న్యాయం చేయాలి: డీసీసీ అధ్యక్షుడు షానవాజ్

Sri Sathya Sai: సింగరాయకొండలో విద్యార్థి తౌషిక్ మృతి, న్యాయం జరగక తల్లి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డీసీసీ అధ్యక్షుడు కేఎస్ షానవాజ్ డిమాండ్ చేశారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 17 Sept 2026 8:17 PM IST
Sri Sathya Sai
X

Sri Sathya Sai: తల్లి, బిడ్డ చావులకు న్యాయం చేయాలి: డీసీసీ అధ్యక్షుడు షానవాజ్

Sri Sathya Sai: ఈ స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో KS షానవాజ్ గారు మాట్లాడుతూ గత ఆరు నెలలకు ముందు సింగరాయకొండ లో గల శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో చదువుకుంటున్న కనిగిరికి చెందిన 11 సంవత్సరాల తౌషిక్ అనే విద్యార్థి అనుమాన స్థితిలో మరణించాడని దీనికి కారణం ఆ యొక్క కోచింగ్ సెంటర్ యాజమాన్యమేనని.

తమకు న్యాయం చేయాలంటూ తల్లి మౌలాబీ గత ఆరు నెలలుగా పోరాడుతున్న న్యాయం జరగలేదని నిస్సహాయ స్థితిలో ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వం పట్టించుకోక పోవడం చాలా అన్యాయమని మొద్దు నిద్రలో ఉన్న కూటమి ప్రభుత్వం వెంటనే కోచింగ్ సెంటర్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమండ్ చేస్తోందని తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అల్లాబకష్, గాండ్లపెంట మండల అధ్యక్షుడు రామి రెడ్డి, మైనారిటీ పట్టణ అధ్యక్షుడు అయాజ్, nsui అధ్యక్షుడు సుహైల్, యూత్ కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు యాసీన్ తదితరులు పాల్గొన్నారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI