Kadiri: కదిరిలో టీడీపీలోకి భారీ చేరికలు – 50 ముస్లిం కుటుంబాలు చేరిక
Kadiri: కదిరిలో టీడీపీలోకి భారీగా ముస్లిం కుటుంబాల చేరిక. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో 50 కుటుంబాలు, యువత పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Kadiri: కదిరిలో టీడీపీలోకి భారీ చేరికలు – 50 ముస్లిం కుటుంబాలు చేరిక
కదిరి: కదిరి పట్టణంలో తెలుగుదేశం పార్టీలోకి ముస్లిం కుటుంబాలు, యువత భారీగా చేరారు. కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ సమక్షంలో పాత 12వ వార్డు, నూతన 14వ వార్డుకు చెందిన సుమారు 50 ముస్లిం కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి.
వార్డు ఇంచార్జ్ కోలార్ ఫరీద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఖాదర్ భాష, రియాజ్, బండి బాక్సు, బాబా ఫక్రుద్దీన్, పటాన్ గౌస్, నిజాం, మహమ్మద్, ఇమ్రాన్, ఆరిఫ్ ఉల్లా, మొగల్ బాబా, బాబ్జాన్, అల్లాబకాష్, ఇబ్రహీం, నాసిర్, యూసుఫ్, అబిద్, ముబారక్, అతహర్, జబిఉల్లా, షకీర్, నజీర్, సాదిక్ తదితరులు టీడీపీలో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ముస్లిం కుటుంబాలు, యువతకు పార్టీ కండువాలు కప్పి సాదరంగా టీడీపీలోకి ఆహ్వానించారు. కదిరి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పార్టీతో కలిసి పనిచేయాలని వారికి సూచించారు.
ముస్లిం మైనార్టీ కుటుంబాలు, యువత టీడీపీలో చేరడం పట్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కదిరి పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్ పాల్గొన్నారు.




