Kadiri: దీనస్థితిలో ఉన్న మాధవికి ఆశ్రయం కల్పించిన మాతృశ్రీ ఆశ్రమం

Kadiri: ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో దిక్కుతోచని స్థితిలో ఉన్న మహిళ మాధవిని, జనసేన నాయకులు మరియు ఆసుపత్రి డైరెక్టర్ల చొరవతో అమడగూరు మాతృశ్రీ వృద్ధాశ్రమానికి సురక్షితంగా తరలించారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 15 Jun 2026 4:10 PM IST
Kadiri
X

Kadiri: దీనస్థితిలో ఉన్న మాధవికి ఆశ్రయం కల్పించిన మాతృశ్రీ ఆశ్రమం

కదిరి: సత్యసాయి జిల్లా కదిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు గత వారం రోజులుగా ఎటువంటి ఆధారం లేని మాధవి అనే మహిళ మానసికంగా దీనస్థితిలో ఉండి పోయింది.

విషయం తెలుసుకున్న ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ డైరెక్టర్స్ వేణుగోపాల్ రెడ్డి మరియు జనసేన నాయకులు లక్ష్మణ కుటాల,వెంటనే స్పందించి అమడగూరు మండలం గాజులవారిపల్లిలో మానవ సేవ మాధవ సేవ అంటూ నిస్వార్థంగా మాతృశ్రీ వృద్ధాశ్రమం ద్వారా

సేవలు నిర్వహిస్తున్న అరుణశ్రీ గారికి విషయం తెలిపిన వెంటనే మానవతా దృక్పథంతో ఆమె స్పందించి ఈరోజు కదిరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నుంచి ఆమెను ఆశ్రమానికి తీసుకొని వెళ్లడం జరిగింది. సహకరించిన కదిరి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి గారికి , Dr. సిరి గారికి , అవుట్ పోస్ట్ A.S.I సురేంద్ర గారికి , హాస్పిటల్ సిబ్బందికి మాతృ శ్రీ నిర్వాహకురాలు అరుణ శ్రీ కృతజ్ఞతలు తెలిపారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI

Next Story