Kadiri: కదిరిలో బీజేపీ కార్యవర్గ సమావేశం.. కీలక అంశాలపై చర్చ!
Kadiri: సత్యసాయి జిల్లా కదిరిలో బీజేపీ పట్టణ శాఖ కార్యవర్గ సమావేశం. పార్టీ సంస్థాగత స్థానిక ఎన్నికలు, యోగా దినోత్సవ ఏర్పాట్లు మరియు మోదీ 12 ఏళ్ల పాలనపై చర్చ.
Kadiri: కదిరిలో బీజేపీ కార్యవర్గ సమావేశం.. కీలక అంశాలపై చర్చ!
కదిరి: శ్రీ సత్యసాయి జిల్లా భారతీయ జనతా పార్టీ కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు కదిరిలో కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కదిరి పట్టణ కార్యవర్గ సభ్యులు మరియు భారతీయ జనతా పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమంలో పార్టీ యొక్క సంస్థాగత స్థానిక ఎన్నికలు మరియు నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల పాలనను విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాల గురించి మరియు యోగా దినోత్సవం గురించి చర్చించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తలుపులు గంగాధర్, ప్రభుత్వ హాస్పిటల్ బోర్డు డైరెక్టర్ సామాల కేశవ రెడ్డి, పట్టణ అధ్యక్షులు పీట్ల రామక్రిష్ణ, మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాదిక్ భాషా, మాజీ పట్టణ అధ్యక్షులు కొత్తా రమేష్ బాబు, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణవేణి, జిల్లా మాజీ కార్యదర్శి అశోక్, బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు తలుపుల తిమ్మరాజు,
రూరల్ మాజీ అధ్యక్షుడు వెంకటా చలపతి, ఓబిసి మోర్చా పట్టణ అధ్యక్షులు జరిపిటీ జయరాజ్,బిజెపి సీనియర్ నాయకులు మార్కండేయ, ఖద్దర్ వెంకటరమణ, వాల్మీకి హరి, బీజేవైఎం రాష్ట్ర నాయకులు హరినాథ్ నాయుడు, అంకాలప్ప, పట్టణ ప్రధాన కార్యదర్శులు బుడగల హరీష్ మరియు పవన్, తుపాకుల నాగార్జున, లక్ష్మీనారాయణ, భరత్ కుమార్, సీనియర్ నాయకులు,కార్యకర్తలు , పాల్గొన్నారు.




