Sri Sathya Sai: చీటీల పేరుతో భారీ మోసం: రూ. 2 కోట్లతో దంపతులు పరారీ!

Sri Sathya Sai: శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో చీటీల పేరుతో రూ.2 కోట్ల మోసం వెలుగుచూడగా, దంపతులు పరారవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

P.RAHAMTULLA, KADIRI
Published on: 4 Oct 2026 11:59 AM IST
Sri Sathya Sai
X

Sri Sathya Sai: చీటీల పేరుతో భారీ మోసం: రూ. 2 కోట్లతో దంపతులు పరారీ!

Sri Sathya Sai: శ్రీ సత్య సాయి జిల్లా కదిరిలో చీటీల పేరుతో భారీ మోసం బయటపడింది. చీటీల పేరుతో 33 మంది బాధితుల దగ్గర రెండు కోట్ల రూపాయలు వసూలు చేసిన టెక్నికల్ అసిస్టెంట్ వీరారెడ్డి దంపతులతో పాటు మరో నలుగురిపై కదిరి పోలీసులు కేసు నమోదు చేశారు. తనకల్లు మండలంలో విబి జి రామ్ జి పథకంలో టెక్నికల్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న వీరారెడ్డి కదిరిలో కాపురం ఉంటూ నమ్మకంగా ఉంటూ బాధితుల దగ్గర పెద్ద మొత్తంలో చీటీలు కట్టించుకుని రెండు కోట్ల రూపాయలు వసూలు చేసుకుని వీరారెడ్డి దంపతులు ఇంటికి తాళం వేసుకొని పరారయ్యారు. వీరారెడ్డి కోసం గాలించిన బాధితులు ప్రయోజనం లేకపోవడంతో కదిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

టెక్నికల్ అసిస్టెంట్ వీరారెడ్డి ప్రభుత్వ ఉద్యోగులు,వ్యాపార వర్గాల వారినే లక్ష్యంగా చేసుకొని భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసుకుని పరారయ్యారు. వీరారెడ్డి మరికొంతమంది బాధితుల దగ్గర చీటీల పేరుతో దాదాపు మూడు కోట్ల రూపాయల దాకా వసూలు చేసుకుని మోసం చేసినట్లు సమాచారం. వీరారెడ్డి కోసం కదిరి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకొని గాలింపు చర్యలు చేపట్టారు.

P.RAHAMTULLA, KADIRI

P.RAHAMTULLA, KADIRI